పుదుచ్చేరికి చెందిన ప్రముఖ ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ 'ఫైనాన్స్ విత్ హరీష్' (27) మంగళవారం చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. సోషల్ మీడియాలో 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న హరీష్, చనిపోయే ముందు పోస్ట్ చేసిన వీడియోలో టెక్ సీఈఓ జాసన్ శామ్యూల్ వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్లు ఆరోపించారు. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి రూ.3 కోట్లు డిమాండ్ చేయడంతో పాటు, తన సోషల్ మీడియా ఖాతాలను శామ్యూల్ తొలగించారని ఆయన తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.