ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చెందిన అన్నెట్ ఫోర్డ్ (57) అనే మహిళ ఆన్‌లైన్ డేటింగ్‌లో రూ.4.3 కోట్లు మోసపోయారు. భర్తకు దూరమైన అన్నెట్ నిజమైన ప్రేమ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. ‘ప్లెంటీ ఆఫ్ ఫిష్’ అనే డేటింగ్ సైట్‌లో విలియం అనే వ్యక్తితో పరిచయమై రూ.1.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. ఆ తర్వాత FACEBOOKలో పరిచయమైన నెల్సన్ అనే వ్యక్తి మరో రూ.కోటిన్నర తీసుకున్నాడు. మరో మహిళకు రూ.98.5 లక్షలు ఇచ్చి మోసపోయారు.