ఆన్లైన్ వ్యభిచార ముఠాను బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టెలిగ్రామ్ గ్రూపు ద్వారా తాను బుక్ చేసుకున్న ఓ యువతి, కొందరు తనను బెదిరించి, దాడి చేసి డబ్బులు లాక్కున్నారని ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి.. ఇద్దరు యువతులతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు సుమలత (28), హర్షిణి (26), జగదీశ్ (35), మంజునాథ్ (30), లోకేశ్ (32)గా గుర్తించారు.