దర్శనానికి మరికొద్ది గంటలే.. ఖైరతాబాద్‌కు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి దర్శనానికి బుధవారం ఆఖరి రోజు. అర్ధరాత్రితో దర్శనాలు ముగియనున్న నేపథ్యంలో ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. ఇప్పటివరకు 18 లక్షల మందికిపైగా దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. చివరి రోజు లక్ష మంది వరకు వచ్చే అవకాశం ఉండటంతో క్యూలైన్లు, బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభం కానుండగా, ఎల్లుండి నిమజ్జనం నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕