పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ న్యాయవాదిపై నమోదైన కేసును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇద్దరి మధ్య ఉన్నది సమ్మతంతో కూడిన సంబంధమేనని, అది బెడిసికొట్టినంత మాత్రాన అత్యాచారం కేసు పెట్టడం సరికాదని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం శారీరక సంబంధం కోసమే, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా మోసపూరితంగా హామీ ఇస్తేనే అది రేప్ కిందకు వస్తుందని కోర్టు వివరించింది.