తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) జూన్-2026 దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30తో ముగియనుంది. అయితే ఇప్పటివరకు అప్లై చేసిన దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే నేటి నుండి మే 3 వరకు అభ్యర్థులు ఎడిట్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా మంగళవారం సాయంత్రం వరకు మొత్తం 96,189 ధరఖాస్తులు అందినట్లు టీజీటెట్ కన్వీనర్ జి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in లో వివరాలను సరిచేసుకోవచ్చని పేర్కొన్నారు.