సర్పంచ్ పదవికి బహిరంగ వేలం.. రూ. 55 లక్షలకు దక్కించుకున్నాడు(వీడియో)

TG: రంగారెడ్డి జిల్లాలోని బ్రాహ్మణపల్లిలో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం కోసం బహిరంగంగా వేలం వేసి రూ.55 లక్షలకు అమ్మేశారు. ముగ్గురు పోటీ పడగా, ఒక యువకుడు ఈ మొత్తానికి పదవిని దక్కించుకున్నాడు. వేలంపాటను అతిక్రమించి ఎవరైనా నామినేషన్ వేస్తే రూ.1 కోటి చెల్లించాలనే షరతు విధించడం గమనార్హం. ఎన్నికల సంఘం వేలంపాటలను చట్టవిరుద్ధమని చెబుతున్నా, కొందరు పట్టించుకోవడం లేదు.

సంబంధిత పోస్ట్