వీడియో కాల్ సాయంతో ఆపరేషన్!.. మహిళ మృతి

TG: జగిత్యాల(D) సారంగాపూర్(M) పోచంపేటకు చెందిన అయిత రాజవ్వ (42) గర్భసంచిలో రాళ్లు రావడంతో జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అయితే ఆపరేషన్ చేసే క్రమంలో రాజవ్వ గుండెపోటుతో మృతి చెందిందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. కానీ HYDలోని వైద్యులతో ఫోన్‌లో వీడియో కాల్ చేస్తూ ఆపరేషన్ చేయడం వల్లనే రాజవ్వ మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. వారి ఫిర్యాదు మేరకు ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్