స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Oppo A7 Pro Max 5G గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదలైంది. ఆగస్టులో చైనాలో విడుదలైన ఈ ఫోన్, ఇప్పుడు థాయ్‌లాండ్, మలేషియా, ఆస్ట్రియా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌లో 10,000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా, IP69K రేటింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో ఈ ఫోన్ లాంచ్, ధర వివరాలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.