సీనియర్ నటుడు రఘుబాబు తన సినీ ప్రయాణాన్ని ఒక ఇంటర్వ్యూలో నెమరువేసుకున్నారు. 'మురారి' చిత్రం తనకు తెచ్చిన గుర్తింపుతో పాటు, ఆ తర్వాత ఎదుర్కొన్న ఊహించని సవాళ్లను ఆయన పంచుకున్నారు. ఆ సినిమా విడుదలయ్యాక కొన్ని నెలల పాటు తనకు అసలు అవకాశాలే రాలేదని, జనాలు తనను చూసి భయపడి దూరం జరిగేవారని రఘుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 'మురారి' తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచినప్పటికీ, ఆ పాత్ర తెచ్చిన ఇమేజ్ వల్ల కొంతకాలం ఇబ్బందులు పడ్డానని రఘుబాబు చెప్పుకొచ్చారు.