పంజాబ్ సీఎం మద్యం తాగి అసెంబ్లీకి వచ్చారంటూ ప్రతిపక్షాల ఆరోపణ

కార్మిక దినోత్సవం సందర్భంగా పంజాబ్ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి హాజరయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, శిరోమణి అకాలీ దళ్ సీఎంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఎమ్మెల్యేలందరికీ ఆల్కహాల్ మీటర్ టెస్ట్ నిర్వహించాలని, సీఎంకు డోప్ టెస్ట్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ ఆరోపణలపై భగవంత్ మాన్ స్పందిస్తూ.. ప్రత్యేక సమావేశం కార్మిక దినోత్సవానికి అంకితమని, సభ్యులందరూ వాదనలకు దూరంగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్