జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసనకు సిద్ధమైన విపక్షాలు!

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌(సీఈసీ)పై విపక్షాలు పార్లమెంటు ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం నోటీసును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఇతర ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్ సంప్రదించినట్లు తెలుస్తోంది. రాబోయే రెండు వారాల్లో ఈ నోటీసులను సమర్పిస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల కమిషన్‌లో భిన్నాభిప్రాయాల అంశం రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕