గ్రేటర్ నోయిడాలో ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆకాష్ అనే వ్యక్తి రూ.1,999 విలువైన ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్డర్ చేస్తే, పార్శిల్లో పేడ వచ్చినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం 5:00 గంటలకు కొరియర్ ద్వారా పార్శిల్ అందుకున్న ఆకాష్, బాక్స్ తెరిచి చూడగా మోసపోయానని గ్రహించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. వెబ్సైట్ వివరాలు, పేమెంట్ ట్రాన్సాక్షన్ డేటా, కొరియర్ డెలివరీ చైన్ను పరిశీలిస్తున్నారు.