TG: ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి వినీష్‌కుమార్(19) మృతి చెండాడు. మహబూబ్‌బాబాద్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం తండాకు చెందిన బోడ ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీఈ (మైనింగ్ ఇంజనీరింగ్) ఫస్టియర్ చదువుతున్నాడు. అయితే తన ప్రేమ విఫలం కావడంతో క్యాంపస్‌లో నిన్న పెట్రోల్ పోసుకొని నిప్పటించుకున్నాడు. చికిత్స పొదుతూ ఇవాళ మరణించాడు.