తన తండ్రి ధర్మేంద్ర చనిపోలేదని కూతురు ఈషా డియోల్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ధర్మేంద్ర మృతికి సంతాపం తెలుపుతూ సినీ ప్రముఖులు పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్‌తో పాటు మీడియా వర్గాలు ఆయన చనిపోయినట్లు భావించాయని పేర్కొన్నారు. ధర్మేంద్ర చనిపోలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.