న్యూయార్క్‌ మెట్‌ గాలాలో మెరిసిన మన కలంకారీ (వీడియో)

న్యూయార్క్‌లో జరిగిన మెట్‌ గాలాలో ప్రముఖ వ్యాపారవేత్త సుధారెడ్డి, 3 వేల ఏళ్ల నాటి మచిలీపట్నం కలంకారీ కళ శైలిలో మనీష్‌ మల్హోత్రా రూపొందించిన 'ట్రీ ఆఫ్‌ లైఫ్‌' గౌను ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ అద్భుతమైన వస్త్రం తయారీకి 90 మంది కళాకారులు 3,459 గంటలు శ్రమించారు. గౌనుపై భాగ్యనగర వృక్ష, జంతుజాలాల ఆకృతులు, వెనుక భాగంలో తెలంగాణ నేపథ్యాన్ని ప్రతిబింబించే మెటల్ వృక్షాకృతి, తంగేడు పువ్వు, జమ్మిచెట్టు, సూర్యుడు, చంద్రుడు, కల్పవృక్ష చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సంబంధిత పోస్ట్