పది ఫలితాల్లో 6 స్కూళ్లలో అందరూ ఫెయిల్

తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ఆసక్తికర దృశ్యం కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,731 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించగా, 6 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఆశ్చర్యకరంగా ఈ ఆరు పాఠశాలలన్నీ ప్రైవేట్ స్కూళ్లే కావడం గమనార్హం. ఈ ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా రాణిస్తున్నాయన్న సంకేతాలను ఇస్తున్నాయి. జిల్లాల వారీగా చూస్తే ములుగు జిల్లా 99.30% పాస్ శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా 89.23%తో చివరి స్థానంలో నిలిచింది.

సంబంధిత పోస్ట్