అండాశ‌య క్యాన్స‌ర్ వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తుందా?

అండాశయ క్యాన్సర్‌ కేసుల్లో ఎక్కువ శాతం వంశపారంపర్యంగా రావు. అయితే సుమారు 25 శాతం కేసులు వంశపారంపర్య క్యాన్సర్‌ పరిస్థితులతో ముడిపడి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా BRCA1, BRCA2 జన్యు మార్పులు ప్రమాదాన్ని పెంచుతాయి. కుటుంబంలో రొమ్ము లేదా అండాశయ క్యాన్సర్‌ చరిత్ర ఉంటే తల్లి వైపుతో పాటు తండ్రి వైపు బంధువుల వివరాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. కడుపు ఉబ్బరం, పొత్తికడుపు నొప్పి, తక్కువ ఆహారంతోనే కడుపు నిండిన భావన, తరచూ మూత్రం రావడం వంటి లక్షణాలు కొత్తగా వచ్చి తగ్గకుండా ఉంటే వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕