కేరళలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోజికోడ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT Calicut)లో 300 మందికి పైగా విద్యార్థులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మంగళవారం ఓ వీడియోని కూడా విడుదల చేశారు. పవన్ కల్యాణ్ ప్రజాసేవ, సామాజిక బాధ్యత పట్ల చూపుతున్న నిబద్ధతకు ఆకర్షితులై యువత మద్దతు తెలుపుతున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.