బిహార్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గోపాల్‌గంజ్‌లో పోలీసులు ఓ టీ విక్రేత ఇంట్లో దాడులు నిర్వహించారు. రూ.1.05 కోట్లకుపైగా నగదు, 344 గ్రాముల బంగారం, 1.75 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. అంతరాష్ట్ర సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ ప్రమేయం ఉందని భావిస్తున్న ఇద్దరు సోదరులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అభిషేక్ కుమార్, సైబర్ క్రైమ్ రాకెట్లో చేరే ముందు టీ స్టాల్ నడిపాడని పోలీసులు తెలిపారు.