కొంతమంది ఏ చిన్న నొప్పి వచ్చినా వెంటనే మందులు వేసుకుంటారు. అయితే ఇలా ప్రతి చిన్న సమస్యకీ మందులు వేసుకోవటం వల్ల ఆరోగ్యానికి అనేక నష్టాలున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. మందులు ఎక్కువగా వాడటం వల్ల ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ వేసుకునే మందుల వల్ల కిడ్నీల ఆయుష్షు తగ్గుతూ పోతుంది. దీర్ఘకాలం పాటు వాడే పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో పాటు, ఆ ప్రభావం లివర్‌పై కూడా పడుతుంది.