ఓజోన్ పొర కోలుకుంటుంది: ఐక్య‌రాజ్య‌స‌మితి

భూమికి రక్షణ కవచంలా ఉన్న ఓజోన్ పొర మళ్లీ కోలుకుంటోందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. రానున్న దశాబ్దాల్లో ఓజోన్ రంధ్రం పూర్తిగా మూసుకుపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతర్జాతీయ ఒప్పందాలు, క్లోరోఫ్లోరో కార్బన్ల వినియోగంపై నియంత్రణలు ఫలితాన్నిచ్చాయని యూఎన్ వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్ పేర్కొంది. సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవం సందర్భంగా ఈ బులెటిన్ విడుదలైంది.

సంబంధిత పోస్ట్