వార్తాపత్రికల్లో ఆహారం ప్యాకింగ్.. ఆరోగ్యానికి పెను ముప్పు!

వార్తాపత్రిక ప్రింటింగ్ ఇంక్‌లో లెడ్, క్రోమియం, క్యాడ్మియం వంటి హానికరమైన హెవీ మెటల్స్‌తో పాటు మినరల్ ఆయిల్స్, ఆర్గానిక్ సాల్వెంట్స్ వంటి రసాయనాలు ఉంటాయి. వేడి, జిడ్డుగల లేదా తేమతో కూడిన ఆహారం ఈ ఇంక్‌తో కలిసినప్పుడు, అందులోని రసాయనాలు ఆహారంలోకి ప్రవేశించి జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వంటివి తలెత్తుతాయి. దీర్ఘకాలికంగా ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే మినరల్ ఆయిల్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వంటి ప్రమాదకర రసాయనాలను విడుదల చేస్తుంది. ఇది కాలేయం, కిడ్నీలు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

సంబంధిత పోస్ట్