253వ సారి నామినేషన్‌ వేసిన పద్మరాజన్‌

తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరు నుంచి డా. కె. పద్మరాజన్‌ 253వ సారి స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో నామినేషన్‌ వేశారు. హోమియోపతి వైద్యుడు, టైర్ల రీట్రేడింగ్ వ్యాపారి అయిన పద్మరాజన్‌ 1988 నుంచి పంచాయతీ, లోక్‌సభ, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేస్తూ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్, లింకా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. వాజ్‌పేయీ, నరసింహారావు, మోదీ, రాహుల్‌ గాంధీ, జయలలిత, కరుణానిధి వంటి అగ్రనేతలపై కూడా పోటీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్