టీటీడీలో ఉన్న అన్యమతస్థులను తొలగించాలి: బండి సంజయ్

TG: తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు అన్యమతస్థులు ఉన్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వెంటనే ఉద్యోగులుగా ఉన్న ఇతర మతస్థులను తొలగించాలని డిమాండ్ చేశారు. అన్ని మతాలకు TTD సత్రం కాదని, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నవారిపై విచారణ చేయాలని కోరారు. టీటీడీ ఏ ఒక్కరి ఆస్తి కాదని.. హిందువులది మాత్రమేనని అన్నారు.

సంబంధిత పోస్ట్