పాకిస్తాన్ ఆఫ్ఘన్ మధ్య డ్యూరాండ్ రేఖ వివాదంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భారత్ - అఫ్గానిస్తాన్ స్నేహాన్ని చూసి సహించలేని పాక్ ఆర్మీ సరిహద్దుల్లో పోరాటానికి దిగగా తాలిబన్ సర్కారు దీటుగా స్పందించింది. పాక్ సైన్యం తమదే పైచేయి అని ప్రకటించుకోగా ఆఫ్ఘన్ వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, దుస్తులను ప్రదర్శించి పరువు తీశారు. మరోవైపు తాలిబన్లను ఒప్పించి శాంతి నెలకొల్పేలా చూడాలని పాకిస్తాన్ ఖతార్, సౌదీ ప్రభుత్వాలను వేడుకుంటోంది.