ఖతార్‌లోని దోహాలో శుక్రవారం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వెంటనే కాల్పుల విరమణ అమలు చేసేందుకు అంగీకరించినట్లు ఖతార్ విదేశాంగశాఖ తెలిపింది. దాని అమలు తీరును సమీక్షించేందుకు తదుపరి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.