పాక్ మరోసారి తన వక్ర బుద్దిని ప్రదర్శించింది. ఓ వైపు శాంతి చర్చలు జరుపుతూనే భారత్ పై దాడులకు తెగబడుతోంది. తాజాగా జమ్మూకశ్మీర్లోని సాంబా, కాథువా సెక్టార్లలో డ్రోన్లతో దాడికి దిగింది. దీంతో అప్రమత్తమైన భారత రక్షణ వ్యవస్థ డ్రోన్లను సమర్థంగా అడ్డుకుంది. అటు పాక్ సైన్యం కాల్పులు కూడా జరుపుతోంది. అయితే అప్పటికే సాంబా వ్యాప్తంగా అధికారులు బ్లాక్ అవుట్ ప్రకటించారు. మరోవైపు పఠాన్కోట్, అమృత్సర్ లోనూ డ్రోన్లు దాడి చేస్తున్నట్లు సమాచారం.