బలూచిస్థాన్‌లో అర్ధరాత్రి పాక్‌ వైమానిక దాడులు

పాకిస్థాన్, బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి వైమానిక దాడులు చేపట్టింది. బలోచిస్థాన్‌లోని చిల్తాన్‌ పర్వత ప్రాంతంలో జరిగిన ఈ దాడుల్లో దాదాపు 14 మంది బలోచ్ ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. చాలా రోజులుగా నిఘాలో ఉన్న ఉగ్రవాదుల రహస్య స్థావరాలను ధ్వంసం చేసినట్లు పాక్ పేర్కొంది. ఈ దాడులు భద్రతా కాన్వాయ్‌లు, మౌలిక సదుపాయాలపై కూడా జరిగినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామాలపై బలోచిస్థాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

సంబంధిత పోస్ట్