భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్థాన్ భారత్ చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు నేపాల్, బంగ్లాదేశ్‌లలో శిక్షణ కేంద్రాలు, నివాస సముదాయాలను సిద్ధం చేస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. ఇటీవల బంగ్లా, నేపాల్ సమీపంలోని భారత రాష్ట్రాల్లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను అరెస్టు చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్ నేపాల్‌లో, అల్-ఖైదా, ఐసిస్ బంగ్లాదేశ్‌లో కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.