పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆయన నోరు పారేసుకున్నారు. భారత్ తన ఓటమిని కప్పి పుచ్చుకునేందుకు ఆఫ్ఘన్‌ను ఉపయోగించుకుంటోందన్నారు. భారత్ సపోర్ట్ చూసుకుని కాబూల్ రెచ్చిపోతుందని, ఎవరైనా తమ వైపు చూస్తే కళ్లను పెకిలించివేస్తామని అన్నారు. రెచ్చగొడితే 50 రెట్లు బలంగా పాక్ స్పందిస్తుందని హెచ్చరించారు.