బలూచ్ రెబల్స్ వద్ద అమెరికా ఆయుధాలు: పాక్ రక్షణ మంత్రి

బలూచిస్తాన్‌లో తిరుగుబాటు చేస్తున్న రెబల్స్ వద్ద ఆధునిక ఆయుధాలు ఉన్నాయని, అవి అమెరికా సరఫరా చేసి ఉండవచ్చని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్  ఆరోపణలు చేశారు. జాతీయ అసెంబ్లీలో మాట్లాడుతూ, బలూచ్ రెబల్స్ వద్ద రైఫిల్స్, నైట్ విజన్ పరికరాలు, థర్మల్ వెపన్ సైట్స్ వంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని, వాటిని ఎదుర్కోవడం పాక్ సైన్యానికి సవాల్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు. రెబల్స్ నాయకత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండి మద్దతు పొందుతోందని, బీఎల్‌ఏ వంటి గ్రూపులు ఆయిల్ స్మగ్లింగ్ ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్