జమ్మూకశ్మీర్ అంశాన్ని ఐరాస వేదికగా పాకిస్థాన్ ప్రస్తావించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్లో ప్రభుత్వాలు సైన్యం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి నడుస్తున్నాయని, అవి పూర్తికాలం అధికారంలో ఉండటం అరుదని ఐరాసలో భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ భారత్లో అంతర్భాగమని స్పష్టం చేశారు. పాకిస్థాన్ తన దేశంలోని సమస్యలను పరిష్కరించకుండా భారత్లో అస్థిరతను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.