ఇరాన్-అమెరికాల మధ్య త్వరలో జరిగే చర్చల్లో పాల్గొనాలని పాకిస్తాన్‌కు ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించింది. తుర్కియే వేదికగా జరిగే ఈ చర్చల్లో ఇరాన్, అమెరికాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్టు, ఒమన్, యూఏఈ వంటి దేశాలను కూడా ఈ చర్చలకు ఆహ్వానించినట్లు సమాచారం. ఇరాన్ అణ్వాయుధాలను సమకూర్చుకునే యత్నాలను అమెరికా వ్యతిరేకిస్తోంది. ఆంక్షలు ఎత్తివేస్తే అణ్వాయుధాల అంశాన్ని వదిలేస్తామని ఇరాన్ అంటోంది.