కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో వీరు హిందువులను లక్ష్యంగా చేసుకుని ఆందోళన చేపట్టారు. భారత ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్‌ల ఫోటోలను ఓ బోన్‌లో ఉంచి అభ్యంతరకరంగా ప్రదర్శించారు. దేశం నుంచి 8 లక్షల హిందువులను వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. దీనిపై అక్కడి భారతీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు.