పాక్‌ మాజీ ఐఎస్‌ఐ చీఫ్‌కు 14 ఏళ్ల జైలుశిక్ష

పాకిస్థాన్ గూఢచార సంస్థ (ISI) మాజీ చీఫ్ ఫైజ్‌ హమీద్‌కు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఉల్లంఘన, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం, అధికార దుర్వినియోగం వంటి అభియోగాలపై మిలటరీ కోర్టు 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. భూకబ్జా, విలువైన వస్తువుల తస్కరించిన ఆరోపణలపై టాప్ సిటీ హౌసింగ్ సొసైటీ సీఈవో పిటిషన్ దాఖలు చేయడంతో హమీద్ అరెస్ట్ అయ్యారు. సుమారు 15 నెలల విచారణ అనంతరం ఈ తీర్పు వెలువడింది. ఈ తీర్పుపై అప్పీలు చేసుకునే హక్కు ఆయనకు ఉంది.

సంబంధిత పోస్ట్