భారత్‌కు పాకిస్తాన్ తాజాగా లేఖ రాసింది. తీవ్ర నీటి ఒద్దడిని ఎదుర్కొంటున్నామని లేఖలో తెలిపింది. సింధు జలాల ఒప్పందంపై పునఃసమీక్షించాలని భారత్‌కు పాకిస్తాన్ రాసిన లేఖలో పేర్కొంది. కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్.. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో పాక్ ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చింది.