సౌదీకి పాక్ సైనిక సాయం

సౌదీ అరేబియాపై హౌతీ రెబల్స్ మరోసారి దాడులకు పాల్పడటంతో, పాకిస్థాన్ తొలిసారిగా అధికారికంగా సౌదీకి సైనిక సాయం చేస్తామని ప్రకటించింది. సౌదీ భూభాగంలో తమ దళాలు సేవలు అందిస్తాయని పాక్ స్పష్టం చేసినప్పటికీ, ఎంతమంది సైనికులను పంపిస్తున్నారన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. గతం లోనే రహస్యంగా 30 నుంచి 40 వేల మంది పాక్ జవాన్లను సౌదీకి పంపినట్లు వార్తలు రాగా, ప్రస్తుతం ఈ అధికారిక నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. గతంలో సరైన స్పందన లేక విమర్శలు ఎదుర్కొన్న పాకిస్థాన్, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్

✕
✕