రక్షణ ఒప్పందం చేసుకున్న పాక్‌-సౌదీ-తుర్కియే

పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు 'మక్కా జాయింట్‌ డిఫెన్స్‌ అగ్రిమెంట్‌' పేరుతో కీలక త్రైపాక్షిక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఏ దేశంపై దాడి జరిగినా దానిని మూడింటిపై జరిగిన దాడిగా పరిగణించి, ఉమ్మడిగా స్పందించనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, నిఘా సమాచారం మార్పిడికి మార్గం సుగమం కానుంది. ఇది ఈ మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

సంబంధిత పోస్ట్