లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో పాకిస్థాన్ ఆస్ట్రేలియాపై 22 పరుగుల తేడాతో అనూహ్య విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 8 వికెట్లకు 168 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు వికెట్లు తీయగా, పాక్ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మాట్ రెన్షా, కామెరాన్ గ్రీన్, జేవియర్ బార్ట్‌లెట్ రాణించినా జట్టును గెలిపించలేకపోయారు.