పాకిస్థాన్ భూభాగంలోకి పొరపాటున ప్రవేశించిన బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా 21 రోజుల తర్వాత పాక్ కస్టడీ నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అతడిని మూడు ప్రాంతాల్లో తిప్పి ఒక లొకేషన్‌లో జైలు సెల్‌లో ఉంచారని, చాలావరకు కళ్లకు గంతలు కట్టే ఉంచారని వెల్లడించాయి. కనీసం నిద్ర పోనివ్వలేదని, బ్రష్ చేసుకోవ్వలేదని తెలిపాయి. మాటలతో వేధిస్తూ,
సరిహద్దులో మోహరింపు గురించి, అధికారుల గురించి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నాయి.