పాకిస్థాన్ నటి హుమైరా అస్గర్ అలీ మృతదేహం ఇటీవల కరాచీలోని ఆమె అపార్ట్‌మెంట్‌లో లభించింది. అయితే ఆమె 9 నెలల క్రితమే మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్ తెలిపారు. చివరి కాల్ గతేడాది అక్టోబర్‌లో నమోదైందని, పొరుగువారు కూడా ఆమెను చివరిసారి అక్టోబర్‌లో చూసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, హుమైరా మృతదేహాన్ని స్వీకరించేందుకు ఆమె తండ్రి నిరాకరించారు. అయితే, ఆమె సోదరుడు మృతదేహాన్ని తీసుకెళ్లారు.