ఖమ్మం జిల్లా ఆరెంపుల గ్రామంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పలువురు పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. పళ్లెంలో మంత్రి చేతులు కడిగి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలతో మంత్రిని అభిషేకించారు. ఈ వీడియో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.