తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో ప్రీ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 'RRR ప్రాజెక్టు మంజూరు చేయాలి. HYD మెట్రో రెండో దశకు అనుమతులు ఇవ్వాలి. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి. మిగిలిన జిల్లాల్లో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు. పెద్దపల్లి, WGL, ADB, కొత్తగూడెంలో విమానాశ్రయాలు మంజూరు చేయాలి. పాలమూరు - RR ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ హోదా ఇవ్వాలి' కోరారు.