నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో హీరో ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్ పాత్ర సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పోలినట్లు కనిపించే ఈ పాత్రలో ఆయన ప్రసంగ శైలి, హావభావాలను అనుకరిస్తూ ప్రియదర్శి ఆకట్టుకున్నారు. తెలంగాణ యాసలో ఆయన డైలాగ్ డెలివరీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రీ బుకింగ్స్‌లోనూ సత్తా చాటింది. విడుదలకు ముందే ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్‌లలో 15 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు చిత్రబృందం తెలిపింది.