పారాక్వాట్ డైక్లోరైడ్‌ బ్యాన్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

మనుషులు, జంతువుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా భావిస్తున్న కలుపు సంహారకం పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ రసాయనాన్ని నిషేధించిన దాదాపు 70 దేశాల సరసన భారత్‌ చేరింది. నిపుణుల కమిటీ సిఫార్సులు, రిజిస్ట్రేషన్‌ కమిటీ సంప్రదింపుల అనంతరం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త రిజిస్ట్రేషన్లపై నిషేధంతో పాటు గతంలో జారీ చేసిన అన్ని రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను రద్దు చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕