ఓటీటీలోకి శివకార్తికేయన్ ‘పరాశక్తి’.. ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన భారీ పీరియాడికల్ పొలిటికల్ డ్రామా ‘పరాశక్తి’ డిజిటల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకోగా ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్న‌ట్లు ప్రకటించింది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1960ల నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం, థియేటర్లలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. దీంతో సినిమా విడుదలైన కేవలం నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్