కదులుతున్న రైల్లోకి పక్కా టైమింగ్‌తో పార్శిల్ డెలివరీ.. వీడియో వైరల్

రైల్వే స్టేషన్‌లో ఆగకుండా, వేగంగా వెళ్తున్న రైలులోకి ఒక వ్యక్తి పార్శిల్‌ను విజయవంతంగా అందజేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రైల్వే ట్రాక్ పక్కన నిల్చున్న వ్యక్తి, వేగంగా వస్తున్న రైలులోని ప్రయాణికుడి వైపు ప్యాకేజీని విసిరాడు. ఇద్దరూ ముందే సమయం, ప్రదేశం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రైలుకు హాల్ట్ లేకపోవడంతో బంధువుకు సంబంధించిన ప్యాకేజీని ఇలా అందించాల్సి వచ్చిందని సదరు వ్యక్తి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕