ఈ తరం పిల్లల్లో సహనం లోపించడానికి తల్లిదండ్రులే కారణమని ఎంపీ, రచయిత్రి సుధామూర్తి అన్నారు. పిల్లలు అడిగిన వెంటనే కోరికలు తీర్చడం వల్ల వారు తక్షణ ఆనందాలకు అలవాటు పడుతున్నారని, ఇది వారిలో సహనాన్ని తగ్గిస్తోందని ఆమె పేర్కొన్నారు. పిల్లలకు ఏదైనా కొనిస్తామని చెప్పి, సమయం పడుతుందని చెప్పడం ద్వారా సహనాన్ని అలవాటు చేయవచ్చని ఆమె సూచించారు.