గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా గుండాల గ్రామంలో మద్యం అలవాటున్న తమ 23 ఏళ్ల కొడుకు రామ్ బాబుభాయ్‌ను తల్లిదండ్రులు బాబుభాయ్, మనిషాబెన్ కలిసి హత్య చేశారు. జూన్ 30న మద్యం సేవించి ఇంటికి వచ్చిన రామ్‌తో గొడవపడి, అతనికి బలవంతంగా యాసిడ్ తాగించి, ఆపై గొంతు నులిమి చంపారు. ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, రామ్ భార్య బన్షిబెన్ ఫిర్యాదుతో పోలీసులు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించారు.